‘ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి’

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ములుగు రూరల్‌: వరి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజాద్‌పాషా అన్నారు. మండల పరిధిలోని కాసిందేవిపేటలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు ఆరబోసుకుని ఉంటున్నారని తెలిపారు. అయినప్పటికీ నేటి వరకు కొనుగోలు చేయక పోవడం దారుణమన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ రహీంపాషా, లింగస్వామి, అబ్దుల్‌నాభి, హుస్సేన్‌, రాజయ్య, రితేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement