ములుగు: అధికారులు గిరిజన చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం అటవీ హక్కులు, పెసా, ఎల్‌టీఆర్ చట్టాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పోలీస్, అటవీ, రెవెన్యూ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల పరిరక్షణకు రూపొందించిన చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండి అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ ఏపీఓ నాగోరావు, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఫారెస్ట్, పోలీస్ అధికారులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులందరూ జనాభా స్వీయగణనను చేసుకోవాలని కలెక్టర్ దివాకర శనివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహ లెక్కింపు, గృహ వసతి గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు సదుపాయాన్ని వెబ్‌పోర్టల్‌లో నేటి నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ గృహ, కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీలో
నిబంధనలు పాటించాలి
అక్రిడిటేషన్ కార్డుల జారీలో నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో శనివారం తన ఛాంబర్‌లో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీఆర్‌ఓ రఫీక్, కమిటీ సభ్యులు షఫీ అహ్మద్, గాదం దేవేందర్, పృధ్వీరాజ్, చుంచు రవి, అబ్దుల్ గఫూర్, రాజేష్, వీరయ్య, అశోక్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


