మలేరియా నియంత్రణకు కృషి | - | Sakshi
Sakshi News home page

మలేరియా నియంత్రణకు కృషి

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

ములుగు రూరల్‌: మలేరియా నియంత్రణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఆరరోగ్య కార్యకర్తలతో ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మలేరి యా వ్యాధి వ్యాప్తి నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. గామాల్లో ప్రజ లకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్‌ శ్రీకాంత్‌, వైద్యాధికారి నాగ గణేశ్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌ అసిస్టెంట్‌ మలేరియా అధికారి దుర్గారావు, సురేశ్‌బాబు, యూనిట్‌ ఆఫీసర్‌ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement