జిల్లా కలెక్టర్‌గా బోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌గా బోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ములుగు/ఏటూరునాగారం: జిల్లా కలెక్టర్‌గా 2018 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ శేర్‌లింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న బోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ములుగు కలెక్టర్‌గా పనిచేస్తున్న టీఎస్‌.దివాకర ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు కలెక్టర్‌గా దివాకర 2024 జూన్‌ 16న బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లాలో సుమారు 22 నెలల పాటు పనిచేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర విజయవంతం కావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా ఐటీడీఏ పీఓగా లెనిన్‌ వత్సల్‌ టొప్పోను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా పనిచేసిన చిత్రామిశ్రా రెండు నెలల క్రితం కరీంనగర్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ దివాకరకు ఐటీడీఏ పీఓగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. ఎట్టకేలకు ఐటీడీఏకు మహబూబాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా పనిచేస్తున్న లెనిన్‌ వత్సల్‌ టొప్పోను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా నియమించారు.

ఐటీడీఏ పీఓ

లెనిన్‌ వత్సల్‌ టొప్పో

కలెక్టర్‌ బోర్కడే

హేమంత్‌ సహదేవ్‌రావు

ఖమ్మం జిల్లాకు బదిలీ అయిన దివాకర

ఐటీడీఏ పీఓగా లెనిన్‌ వత్సల్‌ టొప్పో

Advertisement
 
Advertisement
Advertisement