నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధితోనే ఉజ్వల భవిష్యత్‌

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

ములుగు: యువత నైపుణ్యంలో అభివృద్ధి సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని కలెక్టర్‌ దివాకర టీ ఎస్‌ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భా గంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్‌ సెంటర్‌, ఐటీడీఏ, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్‌, ఉద్యానవన శా ఖల ద్వారా యువతకు అందుబాటులో ఉన్న శిక్షణ తరగతులు, ఉపాధి అవకాశాలపై సంబంధిత అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలోని యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు టాస్క్‌ సెంటర్‌ను ప్రారంభించామని, దీని ద్వారా యువత ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం సాధించేలా ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి 10 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేశామని, ఇందులో 250 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో జ్యూట్‌ బ్యాగుల తయారీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కలెక్టర్‌ సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్‌. మహేందర్‌ జీ, సంపత్‌రావు, ఐటీడీఏ ఏపీఓ నాగరావు, డీఆర్డీఓ చంద్రశేఖర్‌, ట్రైబల్‌ వెల్ఫే ర్‌ డీడీ జనార్దన్‌, ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, ఎస్సీ డెవలప్‌మెంట్‌ ఈడీ ధర్మ నాయక్‌, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, అడిషనల్‌ పీడీ శ్రీనివాసరావు, దేవేందర్‌ పాల్గొన్నారు.

ఎవరి వివరాలు వారే నమోదు చేసుకోవచ్చు

జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్న సర్వేలో కుటుంబ సభ్యులు తమ వివరాలను నేరుగా పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్‌. జీఓవీ. ఐఎన్‌ వెబ్‌ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.

గ్రామాల అభివృద్ధితోనే..

గ్రామాలభివృద్ధితోనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని, దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. మహేందర్‌ జీ, సంపత్‌ రావు, డీఆర్డీఓ చంద్రశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement