ధాన్యం కొనుగోలులో తరుగు తీయొద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలులో తరుగు తీయొద్దు

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాంబశివ

ములుగు రూరల్‌: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు. వడగళ్ల వానతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా తాలు పేరుతో మూడు కేజీల నుంచి 8 కేజీల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం ప్రవీన్‌, కోడెపాక చంటి, బాలు, రాజు, చందర్‌ తదితరులు ఉన్నారు.

పోరాటాలకు సిద్ధం కావాలి

గోవిందరావుపేట: ప్రజాసమస్యల పరిష్కారానికి కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ అన్నారు. మండలంలోని పస్రా గ్రామంలో శుక్రవారం పాసమావేశం అంబాల మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిరెడ్డి సాంబశివ హాజరై మాట్లాడుతూ అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, పోడు భూముల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రతీ కార్యకర్త ముందుండి పోరాటాలు నిర్వహించాలని సూచించారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొదిళ్ల చిట్టిబాబు, గుండు రామస్వామి, సూర్యనారయణ, కన్సోజు సదా నందం, సాంబయ్య, కృష్ణారావు, ఐలయ్య, లెనిన్‌, రాజేశ్వరీ, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement