● డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్
కన్నాయిగూడెం: వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతి కుమార్ సూచించారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం సందర్శించారు. సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నందున రక్షణ చర్యలు పాటించాలన్నారు. వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్మీష, హెల్త్ అసిస్టెంట్లు లక్ష్మణ్, ఓం ప్రకాశ్, స్టాఫ్ నర్సు అజ్మీరా తదితరులు పాల్గొన్నారు.


