● ఆర్టీసీ జేఏసీ పిలుపు
హన్మకొండ: నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకోవడాన్ని నిరసిస్తూ, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ నేడు (శుక్రవారం) ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఖరి మూలంగానే డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జేఏసీ తెలిపింది. జేఏసీ వరంగల్ రీజియన్ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహర్షి భగీరథ
జయంతి వేడుకలు
ములుగు: జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి భగీరథ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి భగీరథుడి చిత్రపటానికి జిల్లా అధికారి రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్ మాట్లాడుతూ అసాధ్యం కాని పనిని సాధ్యం చేిసే ప్రతీ మనిషి భగీరథుడే అన్నారు. మహర్షి భగీరథుడు మానవాళికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షుడు కోడిపాక రవి, జిల్లా కార్యదర్శి కురిమిల్ల మహేందర్, నాయకులు నర్సయ్య, భరత్, పూర్ణ చందర్, అనిశెట్టి రాజ్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
నానో ఎరువుల
వాడకంపై అవగాహన
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట రైతువేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల యాజమాన్య పద్ధతులు, నానో ఎరువుల వాడకంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, అత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి చేయాలని సూచించారు. శాస్త్రవేత్త మధు మాట్లాడుతూ అధిక ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యం దెబ్బతిని చీడ పీడలు అశిస్తాయని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుగా వాడాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్త వీరన్న మాట్లాడుతూ వివిధ రకాల చీడ పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శైలజ, టెక్నికల్ ఏఓ హరిదాసు, సర్పంచ్ చల్ల రాజు, ఆత్మ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


