● చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్
జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి తీవ్రనష్టం మిగిలిందని చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ అన్నారు. మండలంలోని కమలాపురం, ఏటూరునాగారంలో పొలాల్లో విరిగిపోయిన స్తంభాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపోయి కింద పడ్డాయని తెలిపారు. స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి కింద పడిపోయాయని వివరించారు. వందలాది చెట్లు నేలకూలాయని వివరించారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా వానలోనే వద్యుత్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి రాత్రి వరకు విద్యుత్‌ను పునరుద్ధరించారని డీఈ పురుషోత్తంతో పాటు కింది స్థాయి సిబ్బందిని అభినందించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంకా పలుచోట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజలు విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట ఎస్‌ఈ భిక్షపతి, డీఈ పురుశోత్తం, డీఈ నాగేశ్వర్‌రావు, ఏడీఈ ఉమారావు, కృష్ణారావు, ఏఈ స్వామి, లైన్ ఇన్‌స్పెక్టర్ కొండా సమ్మయ్య, లైన్‌మెన్ మధుసూదన చారి, ఏఎల్‌ఎంలు రాజు, అమర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


