ములుగు: జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి విడతలో చేపట్టిన ఇళ్లగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో గురువారం ఇళ్ల గణన శిక్షణ కార్యక్రమాన్ని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అధికారులతో మాట్లాడుతూ జనగణన కార్యక్రమంలో ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇళ్ల గణన ప్రక్రియలో 33 ప్రశ్నలతో కూడిన వివరాలు ఉంటాయని తెలిపారు. ప్రజలకు ప్రతీ ప్రశ్నకు తగిన సమాధానం ఇవ్వాలన్నారు. తొలుత మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు సర్వే చేపడతామని, రెండో విడత 2027 ఫిబ్రవరిలో జనగణన సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిరజ్ఞానాన్ని ఉపయోగించుకొని గణన పూర్తి చేయాలని ఆదేశించారు. దేశంలో తొలిసారిగా జనగణన పూర్తి డిజిటల్ పద్ధతిలో సాగుతుందని వివరించారు. ఈ శిక్షణ తరగతులకు ములుగు మున్సిపాలిటీ కమిషనర్ రమేశ్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పర్యవేక్షకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూక్యాలాల్, ట్రైనీ మాస్టర్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్


