ములుగు రూరల్: వ్యక్తిగత వస్తువులపై ప్రతిఒక్కరూ జాగ్రత్త అవసరమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి తిరిగి సెల్‌ఫోన్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ పోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న స్టేషన్ సిబ్బంది వాటిని తిరిగి బాధితులకు అప్పగించేందుకు కృషి చేస్తారని వివరించారు. ఈ మేరకు సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 25 మంది బాధితులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది మిస్సింగ్ మొబైల్స్ రికవరీలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


