ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్‌లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్‌లు

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్‌లు

శంకర్‌గౌడ్‌ మృతి నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం

హన్మకొండ:వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించి మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్‌లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్‌లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement