రామప్పలో శిక్షణ అధికారులు | - | Sakshi
Sakshi News home page

రామప్పలో శిక్షణ అధికారులు

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో చోటు

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్‌ సెక్రటరీ సర్వీస్‌ ఏఎస్‌వోలు సందర్శించారు. భారత్‌ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వారికి ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

సైకిల్‌ ర్యాలీ

ములుగు రూరల్‌: జిలా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎకో క్లబ్‌, తెంగాణ నేషనల్‌ గ్రీన్‌ కారప్స్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మదర్‌ ఎర్త్‌ డేను పురస్కరించుకుని బుధవారం సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లేశం మాట్లాడారు. అంతర్జాతీయ మదర్‌ ఎర్త్‌ డే గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలయ్య, భాస్కర్‌, కవిత, రాధిక, అనిల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

వెంకటనారాయణకు

ప్రశంసపత్రం

ములుగు రూరల్‌: పోలీస్‌ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో జిల్లాలో ఎంటీఓగా విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ వెంకటనారాయణ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన బుధవారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో ఎస్పీ సుధీర్‌ ఆర్‌ కేకన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటనారాయణను అభినందించారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఈ నెల 21న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని గోపిచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జరిగిన అసోసియేషన్‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో 2026–30 కాలానికిగాను రాష్ట్ర క్యావర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన డాక్టర్‌ పింగిళి రమేష్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా, డాక్టర్‌ మూల జితేందర్‌రెడ్డి జాయింట్‌ సెక్రటరీగా ఎన్నికై నట్లు వారు తెలిపారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

భూపాలపల్లి అర్బన్‌: సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న విద్యుత్‌ సౌద ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో యూనియన్‌ నాయకులు వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్టీపీ ద్వారా సరఫరా అయిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో విద్యుత్‌ సౌద ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్‌ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్‌ రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిబిరాలను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయన్నారు. ఆసక్తి గల కోచ్‌లు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement