ఏటూరునాగారం బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు
ఏటూరునాగారం: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బుధవారం తెల్లవారుజాము నుంచే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు. బస్సులు బంద్ కావడంతో పలుచోట్ల బస్టాండ్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటూరునాగారం నుంచి వరంగల్, హనుమకొండకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు రూ. 250లు వసూలు చేశారు. ప్రయాణికుల అవసరాలను అనుగుణంగా వాహనదారులు చార్జీలు వసూలు చేయడం గమనార్హం.
అధిక చార్జీల వసూలు చేస్తున్న
ప్రైవేట్ వాహనదారులు


