● ములుగు మున్సిపల్ కమిషనర్ రమేశ్
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో 70 శాతం పన్నులు వసూలు అయినట్లు ములుగు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో సిబ్బందితో కలిసి సోమవారం ఇంటి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు ప్రధాన ఆదాయ వనరు అని, ప్రతీ పౌరుడు తన బాధ్యతగా ఇంటి పన్నుతో పాటు ఇతర పన్నులను సమయానికి చెల్లించాలని సూచించారు. బకాయిలు ఉన్న పన్నులను మంగళవారం లోపు చెల్లించాలని ప్రజలను కోరారు. రేపటి నుంచి చెల్లించే పన్నులపై వడ్డీ ఉంటుందని తెలిపారు.


