ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామంలో సీతారాముల చంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలోని పురవీధుల్లో రథం వస్తుండగా భక్తులు ఎదురెళ్లి స్వాగతం పలికి నీళ్లు ఆరబోశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, కోశాధికారి దీనబాంధవస్వామి, ఉపాధ్యక్షుడు చెన్న రాంబాబు, బాల్య ప్రసాద్, పెండ్యాల సంతోష్, బాల్య సతీష్, అనిల్, జగదీశ్, ఆంజనేయస్వామి మాలధారులు పాల్గొన్నారు.


