ఉత్సాహంగా..ఆసక్తిగా..
ఏటూరునాగారం: ఓటు హక్కు తొలిసారి రావడంతో హైదరాబాద్ నుంచి ఉత్సాహంగా తరలివచ్చారు యువ ఓటర్లు. ఏటూరునాగారంలో జరిగిన మొదటి దశ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు యువ ఓటర్లు హాజరై వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. చాలా దూరం నుంచి ఇక్కడ ఓటు వేయాలని సంకల్పంతో వచ్చాను. నాకు ఎంతో సంతోషంగాను ఉంది. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత దేనికి లేదన్నారు. అందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.
– వావిలాల సునిత
ఎన్నికలు ఉన్నాయని తెలిసి చంటిబిడ్డను ఎత్తుకొని వచ్చాం. ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఇక్కడి రావడం చాలా ఆనందంగా ఉంది. భార్య, పిల్లలతో కలిసి ఓటును వినియోగించుకొని తిరుగు ప్రయాణం చేస్తా. కష్టం ఉన్నప్పటికీ ఇష్టంగా ఓటును వినియోగించుకున్నా.
– రాజశేఖర్, హైదరాబాద్
గోవిందరావుపేట: జీపీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం మరుపురాని అనుభూతి. ఇది నా జీవితంలో మరిచిపోలేను. గ్రామాభివృద్ధికి పాటు పడే వ్యక్తికి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెను సిబ్బంది అభినందించారు. యువత ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని పలువురు వివరించారు.
– పులుసం మైత్రి
ఉత్సాహంగా..ఆసక్తిగా..
ఉత్సాహంగా..ఆసక్తిగా..


