
రామప్ప దేవాలయంలో ..
రామప్పలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు భక్తులకు తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని పర్యాటకులు కొనియాడారు. తొలి ఏకాదశి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కుటుంబ సమేతంగా రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామి పూజలు నిర్వహించారు.