
ఏజెన్సీలో చెరువులపై హక్కు కల్పించాలి
వాజేడు : ఏజెన్సీలో నివసిస్తున్న ఓడబలిజలకు చెరువులపై పూర్తిస్థాయిలో హక్కు కల్పించాలని ఓడబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్‌కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. దామోదర్‌తో పాటు ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు గగ్గురి రమణయ్య హైదరాబాద్‌లో సాయికుమార్‌ను కలిసి ఓడ బలిజలు, బీసీలు ఏజెన్సీలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఓడ బలిజలకు మత్స్యకార సభ్యత్వాలు ఇవ్వాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో మత్స్యకారుల సభ్యత్వాల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మెట్టు ధనరాజ్, తోట ప్రశాంత్, బొల్లె విజయబాబు తదితరులు ఉన్నారు.