ప్రజలకు సేవ చేస్తేనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు సేవ చేస్తేనే గుర్తింపు

Jun 29 2025 2:25 AM | Updated on Jun 29 2025 2:25 AM

ప్రజలకు సేవ చేస్తేనే గుర్తింపు

ప్రజలకు సేవ చేస్తేనే గుర్తింపు

జెడ్పీ సీఈఓ సంపత్‌రావు

ఏటూరునాగారం : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తేనే తగిన గుర్తింపు వస్తోందని జెడ్పీ సీఈఓ సంపత్‌రావు పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన తక్కలపల్లి రాజ్యలక్ష్మి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సంపత్‌రావు, మండల ప్రత్యేక అధికారి రాంపతితోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నల్లగుంటకు చెందిన శ్రీనివాసాచార్యులు రచించిన కవిత్వం షీల్డ్‌ను రాజ్యలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్‌, స్థానిక ఎంపీఓ కుమార్‌తోపాటు పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement