
సొంతింటి కలసాకారం చేయడమే లక్ష్యం
ములుగు రూరల్: పేదల సొంతింటి కలసాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్‌తో కలిసి మండలంలోని జగ్గన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుపేదల కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోకూడదని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రూ.5లక్షలు అందించడం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఎంపీడీఓ రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క