
ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలి
● అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ
ఏటూరునాగారం: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. శుక్రవారం మండలంలోని జీసీసీ కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని రెండు రోజుల్లో ఖాళీ చేసి మిల్లర్లకు పంపిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసి ధా న్యం కూడా పంపిస్తామన్నారు. మొలకలు వచ్చిన ధాన్యం ఏ సమయంలో కొనుగోలు కేంద్రానికి వ చ్చారని రైతులను ఆరా తీశారు. మొలక రావడం బాధాకరమని, వాటిని కూడా తీసుకుంటామన్నా రు. 17 శాతం తేమ కంటే ఎక్కువ ఉంటే క్వింటాకు కిలో తరుగు కింద ధాన్యం కోత విధిస్తామన్నారు.
వచ్చే ఏడాది సురక్షిత ప్రాంతాల్లోనే..
వచ్చే ఏడాది నుంచి వర్షాలతో బురద, జలమయం కాకుండా ఉండే మెట్ట ప్రాంతాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతులు సొంతంగా వాహనం మాట్లాడుకొని ధాన్యం బస్తాలను మిల్లులకు తీసుకొస్తే కిరాయి చెల్లిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయఅధికారి ఫజల్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీటీ రాహుల్, జీసీసీ మేనేజర్ వాణి తదితరులు పాల్గొన్నారు.