
ఆయిల్‌పామ్.. అధిక లాభాలు
వాజేడు: జిల్లాలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాకపోగా ప్రతీ ఏడాది నష్టాలను చవి చూస్తున్నారు. ఈ క్రమంలో లాభసాటి పంటల వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సా గుపై రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ పంట సాగు చేసిన రైతులకు ప్రభుత్వం రాయితీలు అధికంగా కల్పిస్తోంది. దీంతో జిల్లాలోని 9మండలాల పరిధిలో 763మంది రైతులు 2,648ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేశా రు. అదే విధంగా అంతర్ పంటగా మరో పంటను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.
రాయితీ ఇలా..
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ముందుగా అధికారులు పంట సాగుపై అవగాహన కల్పించడంతో పాటు రాయితీ వివరాలను వెల్లడిస్తున్నారు. మొక్కల కొనుగోలులో సైతం కొంత రాయితీ కల్పించగా డ్రిప్‌కు సైతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీంతో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
టన్నుకు రూ.21 వేలు..
ఆయిల్‌పామ్ మొక్కలను మూడేళ్లపాటు జాగ్రత్తగా పెంచాలి. తర్వాత పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. దిగుబడి వచ్చే నాటికి టన్నుకు రూ.21 వేల మద్దతు ధర లభిస్తుంది. దీంతో రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. అదే విధంగా ఈ మూడేళ్లలో ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర్ పంటలను సైతం సాగు చేసుకునే వీలుంది. మూడేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభం కావడంతో రైతులకు ఆదాయం సమకూరుతుంది. ఇలా 30ఏళ్ల పాటు ఆదాయం పొందే అవకాశం ఉండడంతో రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
మండలాల వారీగా రైతులు సాగుచేసిన పంట వివరాలు
మండలం రైతులు ఎకరాలు
ములుగు 144 467.82
ఏటూరునాగారం 64 165.34
కన్నాయిగూడెం 18 40.92
గోవిందరావుపేట 139 442.64
మంగపేట 118 432.19
ఎస్‌ఎస్ తాడ్వాయి 102 264.04
వెంకటాపురం(ఎం) 80 285.65
వాజేడు 48 291.47
వెంకటాపురం(కె) 50 257.92
ప్రభుత్వం నుంచి రాయితీలు
టన్నుకు రూ.21వేల ధర
30ఏళ్ల పాటు దిగుబడి
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
మండలాల వారీగా స్థానిక అధికారులతో కలిసి ఆయిల్‌పామ్ సాగు, సబ్సిడీ గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మొక్కల కొనుగోలులో ఒక్కో మొక్కకు రూ.232కాగా అందులో రైతు రూ.20చెల్లిస్తే మొక్కలను అందిస్తారు. డ్రిప్‌కు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీ కాగా బీసీలకు 90శాతం, ఓసీ రైతులకు 80శాతం మేర రాయితీ లభిస్తుంది. ఒక రైతుకు 12ఎకరాలకు మాత్రమే డ్రిప్ సబ్సిడీ వస్తుంది. దీంతో ఆయిల్‌పామ్ సాగును రైతులు ఇష్టపడి సాగుచేస్తున్నారు.
– అనసూయ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి

ఆయిల్‌పామ్.. అధిక లాభాలు

ఆయిల్‌పామ్.. అధిక లాభాలు