
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్‌రెడ
మంత్రి శ్రీధర్‌బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబును, అధికారులను అభినందించారు.
మంత్రులు
ఏమన్నారంటే..
● మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు
కృతజ్ఞతలు తెలిపారు.
● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు.
● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు.
● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు.
– మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu

కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్‌రెడ