
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక
● సరస్వతిఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉద యం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచ రించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యులు పాల్గొననున్నారు.
– కాళేశ్వరం
– వివరాలు 8లోu