
సీడ్ ధాన్యమంతా కొట్టుకుపోయింది
ఆడమగ సీడ్ ధాన్యం మొత్తం తడిసిపోయింది. అకాల వర్షానికి గింజ పనికి రాకుండా పోతుంది. తడిసిన సీడ్ ధాన్యాన్ని కంపెనీ వారు సైతం కొనుగోలు చేయమని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆర్థికంగా రైతులను ఆదుకోవాలి.
– వట్టం అమృత, సీడ్ ధాన్యం రైతు,
గోగుపల్లి, ఏటూరునాగారం
90బస్తాల వడ్లు కొట్టుకుపోయాయి
గోగుపల్లిలో కురిసిన అకాల వర్షంతో 90బస్తాల వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. వారం రోజులుగా కాంటా వేయకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. తరుగు తీస్తామని, తేమ ఉందని జాప్యం చేశారు.
– ఈసం నారాయణ,
రైతు, గోగుపల్లి, ఏటూరునాగారం
ఐదెకరాల ధాన్యం తడిసిపోయింది
ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. మూడు రోజుల క్రితం మిషన్‌తో వరి కోయించాను. ధాన్యాన్ని అమ్ముకునేందుకు కల్లంలో ఆరబోశాను. అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. కష్టపడి పండించి చేతికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– ఈసం వెంకన్న, గంగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి
●

సీడ్ ధాన్యమంతా కొట్టుకుపోయింది

సీడ్ ధాన్యమంతా కొట్టుకుపోయింది