
మల్లూరులో ఘనంగా రథోత్సవం
మంగపేట: మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అమరవాది కృష్ణమాచార్యుల బృందం ఆగమనశాస్త్రం ప్రకారం పండితులు, రుత్వీకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు చతుస్త్రావార్చన, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, శిఖాంజనేయస్వామికి పంచామృతాలతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు. దేవతామూర్తులను పూలతో అలంకరించి రాత్రి 7 గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకి మోసేందుకు భక్తులు బారులుదీరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన కుమారాచార్యులు, ఈశ్వర్‌చంద్, భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవాలయం పండితులు రుత్వీకులు, అమరవాది రామనర్సింహాచార్యులు, పెరుంబూదూర్ మధనమోహన్‌చార్యులు, మణిదీపాచార్యులు, అభిరామచార్యులు, రాచంద్రచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎర్రంగారి నరేశ్, నాసిరెడ్డి నాగిరెడ్డి, పల్నాటి సత్యం, దామెర సారయ్య తదితరులు పాల్గొన్నారు.

మల్లూరులో ఘనంగా రథోత్సవం