
‘సీతక్కను విమర్శించే హక్కు కవితకు లేదు’
ములుగు: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను కవిత చదివారన్నారు. రామప్పను దర్శించుకోవడానికి వచ్చిన ఆమె రామప్ప ప్రతిష్ట గురించి మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. వర్షాల సమయంలో రైతులకు అండగా సీతక్క నిలిచి అండగా నిలిచారన్నారు. వర్షాలు పడినప్పుడు కనిపించని బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో ఎండీ చాంద్ పాషా, నల్లెల భరత్ కుమార్, మర్రి రాజు యాదవ్, మావిరపు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.