
రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
వెంకటాపురం(ఎం): పాకిస్తాన్‌పై తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ యుద్ధం విజయవంతంగా పూర్తి కావాలని, భారత సైనికులు సురక్షితంగా ఉండాలని కోరుతూ శుక్రవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో దేవాదాయ ధర్మదా య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండోమెంట్ పరిశీలకులు కవిత, ఈఓ బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని ఎల్లారెడ్డిపల్లెలో బేతి సతీష్ ఆధ్వర్యంలో, నల్లగుంటలో నాగుల రవి, రామగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు పూజలు నిర్వహించారు.
రామప్ప భూముల
కౌలు ఆదాయం రూ. 2.38 లక్షలు
రామప్ప ఆలయానికి చెందిన భూములను 2025–26 సంవత్సరానికి గాను కౌలుకు ఇచ్చేందుకు శుక్రవారం రామప్పలో వేలం పాటలు నిర్వహించగా రూ.2.38 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మీదేవిపేట పరిధిలోని 9 ఎకరాలకు రూ. 1.10.000 వేలు, పాలంపేట పరిధిలోని గార్లగడ్డ మూడు ఎకరాల భూమికి రూ.97 వేలు, వెంకటాపూర్ పరిధిలోని రెండు ఎకరాల భూమికి రూ.31 వేల ఆదాయం కౌలు వేలం పాటల ద్వారా వచ్చినట్లు తెలిపారు.