
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల అకాల వర్షం కురిసే అవకాశం ఉంది.
మహిళల ఆర్థికాభివృద్ధికి అధికారుల కృషి
● మంత్రి ధనసరి సీతక్క
ములుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సెర్ప్ అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క కొనియాడారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన సొసైటీల్లో ఉత్తమ పనితీరును కనబర్చిన జిల్లా సెర్ప్ అధికారులకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా మంత్రి సీతక్క గురువారం హైదారాబాద్‌లో సంబంధిత అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.226 కోట్లకు గాను రూ.235 కోట్లను అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య, డీఆర్‌డీఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.