
క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ములుగు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ క్రీడామైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు వరల్డ్ అథ్లెటిక్స్ డేను పురస్కరించుకుని బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యం, ఏకాగ్రత పెంపొందుతుందని వెల్లడించారు. అనంతరం కోచ్ పర్వతాల కుమారస్వామి మాట్లాడుతూ 4 నుంచి 7ఏళ్ల లోపు చిన్నారులు, 8నుంచి 11, 12నుంచి 14ఏళ్ల బాలబాలికలకు స్పూన్ రిలే, బ్రాండ్ జంప్, స్టాండింగ్ జంప్ రిలే పోటీలను నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేసినట్లు కోచ్ కుమారస్వామి తెలి పారు. ఈ కార్యక్రమంలో సంపత్, జగదీశ్, స్వామి, రమేష్, అబ్బు, హుస్సేన్, ఎల్లయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, రాజబాబు పాల్గొన్నారు.