Vivek Aginihotri-Kareena Kapoor: కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ కౌంటర్‌, వేడి కాఫీలో ముంచేస్తారు

Vivek Agnihotri Reacts to Kareena Kapoor Comments Over Boycott Laal Singh Chaddha - Sakshi

‘బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంలో ఆమిర్‌ ఖాన్‌కు మద్ధతు తెలిపేందుకు ముందుకు వస్తున్న హీరోలకు సైతం బాయ్‌కాట్‌ సెగ తాకుతోంది. అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌లు ఆమిర్‌కు సపోర్ట్‌ చేయడంతో వారి సినిమాలను కూడా బహిష్కరించాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాల్‌ సింగ్‌ చడ్డాకు వసూళ్లు పడిపోవడంపై ఇటీవల ఓ ఇంటర్య్వూలో కరీనా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ మంచి సినిమా అని, ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదంది.

చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన

అంతేకాదు మూడేళ్ల పాటు 250 మంది ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని వాపోయింది కరీనా. అయితే ఆమె వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి స్పందించాడు. బాలీవుడ్ డాన్‌లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘చిన్న సినిమాలు, మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను బాలీవుడ్‌ డాన్‌లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ చిత్రాలకు థియేటర్లకు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు.

దానివల్ల ఎందరో ప్రతిభ కలిగిన నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశమయ్యాయి కదా! ఆ సినిమాలకు పని చేసింది కూడా 250 మంది పేద ప్రజలే’ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అలాగే మరొ ట్వీట్‌లో ‘బాలీవుడ్‌ డాన్‌ల ఆహంకారం,  హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీ ముంచేస్తారు’ అంటూ ఘాటూ వివేక్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌ హీరో నాగా చైతన్య కీ రోల్‌ పోషించాడు. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top