తగ్గేదేలే అంటోన్న విశ్వక్ సేన్.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్! | Vishwak Sen's Gammi Movie Box Office Collections On Day 2 | Sakshi
Sakshi News home page

విశ్వక్ సేన్ గామి వసూళ్ల పర్వం.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Mar 10 2024 11:42 AM | Updated on Mar 10 2024 11:55 AM

Vishwak Sen Gammi Movie Box Office Collections On Day 2  - Sakshi

విశ్వక్‌ సేన్‌  హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్‌ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లో మొదటి రోజు ‍అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9.07 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఇక రెండో వీకెండ్ కావడంతో వసూళ్ల పర్వం ఏమాత్రం తగ్గలేదు. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు 6.03 కోట్లు వసూళ్లతో రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకుంది. ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోగా.. మూడో రోజు మిగిలిన ఏరియాల్లోను రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా థియేటర్లలో 52 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

గామి ప్రత్యేకతలు..
ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్‌ ఎన్నో కష్టాలు పడింది. మైనస్‌ 25 డిగ్రీల చలిలో షూట్‌ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్‌ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్‌ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్‌ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్‌ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్‌ చేయడం విశేషం.


 

Advertisement
 
Advertisement
Advertisement