Vijay Devarakonda-Koffee With Karan: చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌.. నీళ్లు నమిలిన విజయ్‌

Vijay Devarakonda And Ananya Pandey In Koffee With Karan Show Promo Out - Sakshi

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం లైగర్‌. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మూవీ టీం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్ష్‌న్‌ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా లైగర్‌ హీరోహీరోయిన్లు విజయ్‌, అనన్య పాండేలు కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌ షోలో పాల్గొన్నారు. త్వరలోనే రాబోయే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్‌, అనన్యలను తన బోల్డ్‌ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కరణ్‌ జోహార్‌.  

చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్‌

నీకు చీజ్‌ ఇష్టమా? అని విజయ్‌ని ప్రశ్నించగా.. వామ్మో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ ముసిముసిగా నవ్వాడు విజయ్‌. ఆ వెంటనే గత ఎపిసోడ్‌లో జాన్వీ, సారాలు విజయ్‌ గురించి మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు కరణ్‌.  ఆ తర్వాత తన పార్టీలో అనన్య ఎదో చేసిందని దారి గురించి అడగాలి అంటుండగా ఆమె వద్దు వద్దు అంటూ అడ్డుపడింది. ఆ వెంటనే నీకు ఆదిత్య రాయ్‌ కపూర్‌ మధ్య ఏం జరగుతోందని అడిగి అనన్యను చిక్కుల్లో పడేశాడు. దీంతో ఆమె మాట మాట్లాడకుండా షాకై చూస్తుంది.

చదవండి: జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ పెద్దావిడ రచ్చ, వీడియో వైరల్‌

ఇక ఆ తర్వాత విజయ్‌ని ‘చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్‌ చేశాడు విజయ్‌. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది. ఆమె సమాధానానికి కరణ్‌ ఆశ్చర్యంగా చూస్తూ.. మొదటిసారి.. ఈరోజు ఉదయమా! అంటాడు. ఇలా శాంతం ప్రోమో ఆసక్తిగా సాగింది. దీనికి ‘ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం వేయింటింగ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top