ఓటీటీకి సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Vaibhav Latest Movie Ranam will be streaming On This Ott Platform | Sakshi
Sakshi News home page

Ranam Movie Ott: ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్!

Apr 17 2024 12:36 PM | Updated on Apr 17 2024 1:36 PM

Vaibhav Latest Movie Ranam will be streaming On This Ott Platform - Sakshi

వైభ‌వ్‌, నందితాశ్వేత జంటగా నటించిన చిత్రం రణం.  మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో ర‌ణం అర‌మ్‌ థ‌వ‌రేల్ పేరుతో ఫిబ్ర‌వ‌రి 23న థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఓ సిరియల్‌ కిల్లర్‌ చేసిన హత్యలను చేధించే కథాంశంతో ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ష‌రీఫ్ తెరకెక్కించారు. 

తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఓవ‌ర్‌సీస్‌ ఆడియన్స్‌ కోసం టెంట్‌కోట్టాలోనూ స్ట్రీమింగ్‌కు రానుంది. దాదాపు థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత  ఓటీటీలోకి వ‌స్తోంది. 

ఈ చిత్రంలో ఓ స్కెచ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఈ సినిమాలో నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మరోవైపు మరో హీరోయిన్ తాన్యా హోప్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో కనిపించింది. వీళ్లంతా కలిసి సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అన్నదే కథ. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement