‘ఉప్పెన’ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్‌ రికార్డు | Uppena First Day Collections: Vaishnav Tej Gets All Time Record | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ డే కలెక్షన్ల ‘ఉప్పెన’.. భారీ వసూళ్లు

Feb 13 2021 1:06 PM | Updated on Feb 13 2021 3:14 PM

Uppena First Day Collections: Vaishnav Tej Gets All Time Record - Sakshi

చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం తొలి రోజు భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు‌ కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబ‌ట్టింది. మొదటి రోజు భారీ స్థాయలో కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు.

ఎక్కడ ఎంత వసూలు చేసిందనే విషయానికి వస్తే..
►  నైజాం.. రూ.3. 08 కోట్లు
►వైజాగ్ రూ. 1. 43 కోట్లు
►ఈస్ట్ రూ. 0.98 కోట్లు
► వెస్ట్ రూ. 0.81 కోట్లు
► క్రిష్ణా రూ. 0.62 కోట్లు
► గుంటూరు రూ. 0.65 కోట్లు
► నెల్లూరు రూ. 0.35
► ఏపీ మొత్తం రూ. 4. 87 కోట్లు
► సీడెడ్ రూ. 1. 35 కోట్లు
► నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు
►‌కర్ణాట‌క‌ రూ.52 ల‌క్ష‌లు
►త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు
►ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు

కాగా మొన్నటి వరకు థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. అంతేగాక నేడు రేపు వీకెండ్‌ కావడంతోపాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ప్రేమికులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఉప్పెన చిత్రంలో చాలానే ఉండటంతో ‘ఉప్పెన’ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పే ఛాన్స్‌ ఉంది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమ‌ణి రాసిన‌ 'నీ క‌న్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మ‌రింత విజయాన్ని తెచ్చి పెట్టడంలో కృషి చేసింది.
చదవండి: ‘ఉప్పెన’మూవీ రివ్యూ
దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement