Upasana Konidela Shares Her Audi e Tron Car Video - Sakshi
Sakshi News home page

Upasana Konidela: కొత్త కారులో ఉపాసన, వీడియో షేర్‌ చేసిన రామ్‌చరణ్‌ సతీమణి

Jul 30 2022 9:05 PM | Updated on Jul 30 2022 9:23 PM

Upasana Konidela Shares Her Audi e tron Car Video - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల కొత్త కారును కొన్నారు. ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ కారు అయిన ఆడి ఇ-ట్రాన్‌ను ఇటీవలే ఆమె సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ కారు గురించి చెప్తూ.. ఇందులో తానెంతో సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నానంటోంది ఉపాసన. ఇక ఈ కారు విలువ దాదాపు రూ.1.66కోట్ల పైచిలుకేనని తెలుస్తోంది.

ఇక తన కొత్త కారు గురించి తెలుపుతూ ఉపాసన ఓ వీడియో షేర్‌ చేసింది. 'ఈ ప్రపంచంలో ప్రతీది అప్‌గ్రేడ్‌ అవుతోంది, అందుకనుగుణంగా నేను కూడా అప్‌గ్రేడ్‌ అయ్యాను. అందులో భాగంగానే ఆడి ఇట్రాన్‌ను కొన్నాను. నా అన్ని అవసరాలకు కూడా ఈ కారు ఎంతో అనువుగా, ప్రయాణానికి సైతం చాలా సౌకర్యవంతంగా ఉంది. మరీ ముఖ్యంగా వాయిస్‌ కమాండింగ్‌ ఆప్షన్‌ మరింత బాగుంది' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

చదవండి: ట్రైలర్‌లో బూతు సన్నివేశాలకు శ్లోకం ఎలా వాడతారు?
పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన జగపతిబాబు

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement