నటుడు విజయ్ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్ చేశారు. అందులో మాంభూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్‌ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్‌ను కూడా పోస్ట్ చేశారు. నిజమే జననాయకన్ చిత్రం ఇంటర్నెట్‌లో లీక్ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి.
Maanbumigu Thamizhaga Mudhalvar
Dr. C. Joseph Vijay
Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026


