TikTok Star: ఓ పక్కన మంటలు అంటుకుంటుంటే పోజులు కొడుతూ వీడియో చేస్తున్నావా?

Trolls On Pakistani TikTok Star For Posing By Forest Fire, Video Goes Viral - Sakshi

టిక్‌టాక్‌ మాయలో పడి జనాలు వ్యూస్‌ కోసం లైక్స్‌ కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోయారు. మన దేశంలో టిక్‌టాక్‌ను ఎప్పుడో బ్యాన్‌ చేశారు కానీ విదేశాల్లో మాత్రం ఇంకా ఈ యాప్‌ రన్‌ అవుతూనే ఉంది. కొందరు మంచిపనులతో, మరికొందరు పిచ్చిపనులతో సెలబ్రిటీలుగా మారుతున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా స్టార్‌ హ్యుమైరా అస్గర్‌ షేర్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియోపై యావత్‌ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరూ ఫైర్‌ అయ్యేంతలా ఆమె ఏం చేసిందంటారా? హ్యుమైరా తగలబడుతున్న చెట్ల ముందు అందంగా తయారై సుకుమారంగా నడుచుకుంటూ వెళ్లింది.

'నేనెక్కడ అడుగుపెడితే అక్కడ ఫైరే..' అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేయగా అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'పిచ్చిదానివా? నీ వీడియో కోసం అడవిని తగలబెడతావా? నీపై కేసు పెట్టాలి' అని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హ్యుమైరా స్పందిస్తూ తాను చెట్లకు ఎటువంటి హాని తలపెట్టలేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆవేశం చల్లారని నెటిజన్లు 'ఒకవేళ నువ్వు నిప్పు పెట్టకపోయినా అక్కడ తగలబడుతుంటే వీడియోలు తీసేబదులు నీళ్లు పోసి చల్లార్పవచ్చు కదా' అని మండిపడుతున్నారు. కాగా హ్యుమైరా అస్గర్‌కు టిక్‌టాక్‌లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

చదవండి 👇

ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్‌తో ప్రియుడి సర్‌ప్రైజ్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top