గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్‌ | Tamil Comedian Thavasi Suffering From Cancer Seeks Help | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్‌

Nov 17 2020 2:19 PM | Updated on Nov 17 2020 2:45 PM

Tamil Comedian Thavasi Suffering From Cancer Seeks Help - Sakshi

తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్‌ కోలీవుడ్‌ పెద్దలను అభ్యర్థించారు.

సాక్షి, చెన్నై: తమిళ సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన తవసికి పెద్ద కష్టం వచ్చిపడింది. గత కొంత కాలంగా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న తవసి ఆర్థికంగానూ చితికిపోయారు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగానూ కుదేలైన తవసి చాలా సన్నబడిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్‌ కోలీవుడ్‌ పెద్దలను అభ్యర్థించారు. ఈ క్రమంలో నడిగర్ సంఘం స్పందించింది. తవసికి సాయం చేసేందుకు ముందుకు రావాలని సోషల్ మీడియాలో వేదికగా అర్థించింది. తన కామెడీతో నవ్వులు పూయించిన తవసి దీనస్థితి చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. తోచినంత సాయం చేస్తామని ముందుకొస్తున్నారు.
(చదవండి: వైద్య చరిత్రలోనే గొప్ప మైలురాయికి నాంది)

Advertisement
 
Advertisement
Advertisement