Suriya: 'ఈ సినిమా చూసి సీఎం రెండు పేజీల లేఖ రాశారు'

Suriyas Jai Bheem Movie To Start Streaming On Amazon Prime - Sakshi

Suriyas Jai Bheem Movie To Start Streaming On Amazon Prime: ‘‘పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్‌’. ఈ సినిమా అందర్నీ ఆలోచింపచేస్తుంది’’ అని హీరో సూర్య అన్నారు. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య, రాజీషా విజయన్‌ జంటగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. ప్రకాష్‌ రాజ్, రావు రమేష్, సంజయ్‌ స్వరూప్‌ కీలక పాత్రల్లో నటించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య శివకుమార్‌ నిర్మించిన ఈ సినిమా మంగళవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ– ‘‘హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రు 1993లో ఓ గిరిజన మహిళకు న్యాయం చేయడం కోసం ఆమె తరఫున ఓ న్యాయవాదిగా వాదించారు. ఆ కేసు ఆధారంగానే ‘జై భీమ్‌’ రూపొందించాం. తమిళనాడు సీఎం స్టాలిన్‌గారు మా సినిమా చూసి, అభినందిస్తూ రెండు పేజీల లేఖ రాశారు. రావు రమేశ్‌ సార్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు.

‘‘గిరిజన ప్రాంతాల్లో ‘జై భీమ్‌’ షూటింగ్‌ చేయడం గొప్ప అనుభూతి. క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు రూమ్‌ డ్రామా సన్నివేశంలో రావు రమేశ్‌గారి నటనకి యూనిట్‌ అందరూ క్లాప్స్‌ కొట్టారు’’ అన్నారు జ్ఞానవేల్‌. రావు రమేశ్‌ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో పెరిగాను. తమిళ్‌లో చేయాలనే ఆశ ఉండేది. ‘జై భీమ్‌’లో అవకాశం ఇచ్చిన జ్ఞానవేల్, సూర్యలకు థ్యాంక్స్‌. చెన్నైలో ఉన్నప్పుడు తమిళ్‌ నేర్చుకున్నాను.. దీంతో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడుకి చెందిన ‘ఇరుళర్‌’ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కు రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు సూర్య, ఆయన సతీమణి, నటి జ్యోతిక

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top