బర్త్‌డే రోజునే సూపర్‌ స్టార్‌ కృష్ణకు అరుదైన గౌరవం | Sakshi
Sakshi News home page

Super Star Krishna Birthday: సూపర్‌ స్టార్‌ కృష్ణకు అరుదైన గౌరవం

Published Tue, May 31 2022 3:11 PM

Super Star Krishna Received Celebrity Book Of World Record On His Birthday - Sakshi

తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌ సూపర్ స్టార్‌ కృష్ణ బర్త్‌డే నేడు. మంగళవారంతో(మే 31న) ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తనయుడు, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కోడలు ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. అలాగే సీని ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు ఆయన బర్త్‌డే నేపథ్యంలో కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వరించింది.

చదవండి: తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్‌ పోస్ట్‌

ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే సూపర్‌ స్టార్‌ కృష్ణ. 80 ఏళ్ల పాటు సినిమాకు, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజునే ‘సెలబ్రెటీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌’ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన కలకాలం  ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

చదవండి: ఎన్టీఆర్‌ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement