Mahesh Babu Daughter Sitara Superb Dance To Sai Pallavi's Song - Sakshi
Sakshi News home page

ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్‌ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు

Published Fri, Jun 16 2023 6:54 AM

Sitara Dance Mahesh Babu Latest Song Sai Pallavi - Sakshi

ప్రముఖ నటుడు మహేశ్‌బాబు  తనయ సితార సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఫొటోషూట్‌, విహార యాత్రలు, వేడుకలు.. ఇలా తాను ఎంజాయ్‌ చేసిన వాటన్నింటి వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేశ్​ నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుంటోంది.  కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వద్ద సీతార కొద్ది రోజులుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే.

(ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్‌)

తాజాగా సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీలోని సారంగదరియా సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. తన పెర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సితార డాన్స్ వీడియోకు కేవలం గంట సమయంలోనే దాదాపు లక్షకు పైగా లైక్స్‌ రావడం విశేషం. టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సితార చాలా డిఫరెంట్‌..

ఇప్పటికే తను జ్యూయెలరీ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్‌ చేసింది. దీంతో యాడ్‌ కోసం అతి పెద్ద సంస్థకు సైన్‌ చేసిన మొదటి భారతీయ స్టార్‌ కిడ్‌గా నిలిచింది. అందుకు గాను సితార భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే షూట్‌ పూర్తి అయినట్లు సమాచారం. దీంతో మా సితార పాప మల్టీ టాలెంటేడ్‌ అని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు, డైరెక్టర్‌?)

Advertisement
 
Advertisement
 
Advertisement