కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో వస్తోన్న చిత్రం గుమ్మడి నర్సయ్య. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల రిలీజైన గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్పై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవీ ప్రశంసలు కురిపించింది. ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన శ్యామలా దేవీ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.
శ్యామలా దేవీ మాట్లాడుతూ .. ‘పోస్టర్ ఎక్సలెంట్‌గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
