ఆ తర్వాతే నా కెరీర్‌ మలుపు తిరిగింది | Shruti Haasan Reveals Miraculous Life Change After Visiting Varahi Amman Temple | Sakshi
Sakshi News home page

ఆ తర్వాతే నా కెరీర్‌ మలుపు తిరిగింది

May 4 2026 1:47 AM | Updated on May 4 2026 1:47 AM

Shruti Haasan Reveals Miraculous Life Change After Visiting Varahi Amman Temple

‘‘చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే నా  కెరీర్‌ మలుపు తిరిగింది’’ అన్నారు శ్రుతీహాసన్‌. ఆమె తండ్రి , ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ నాస్తికుడు అనే విషయం తెలిసిందే. శ్రుతీహాసన్‌ మాత్రం ‘నేను నాస్తికురాలిని కాదు... నాలో దైవ భక్తి, విశ్వాసం ఉన్నాయి’ అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో వారాహి అమ్మవారి ప్రభావం చాలా ఉంది. మైలాపూర్‌లో ఉన్న వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే నా కెరీర్‌ మలుపు తిరిగింది. మనం ఓ గుడికి వెళ్లాలని నిర్ణయించుకుని వెళతాం.

అయితే దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. వారాహి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లగానే భక్తి పారవశ్యాన్ని పొందాను. అంతేకాదు.. ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తోందనిపించింది. ఆ గుడిలో వీఐపీ క్యూలు లేవు... ఆడంబరాలు లేవు. కేవలం శక్తివంతమైన వారాహి అమ్మవారు మాత్రమే ఉన్నారు. అదే విధంగా అస్సాంలోని శక్తిపీఠం కామాఖ్య దేవాలయాన్ని కూడా సందర్శిస్తుంటాను. నాలోని మానసిక ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతనే కారణం అనుకోవచ్చు’’ అని శ్రుతీహాసన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయ్‌ సేతుపతి సరసన ‘ట్రైన్‌’ మూవీలో నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement