Shraddha Srinath: తన ఫొటోకు వేరే నటి పేరు.. తిట్టిపోసిన హీరోయిన్‌

Shraddha Srinath Satires On Social Media Account - Sakshi

జెర్సీ సినిమా హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇంకెవరు శ్రద్ధా శ్రీనాథ్‌. ఇవేకాదు.. ఆరట్టు, కృష్ణ అండ్‌ హిస్‌ లీల, విక్రమ్‌ వేద.. ఇలా మరెన్నో సినిమాలు చేసింది. అయితే ఓ మీడియా శ్రద్దా శ్రీనాథ్‌ ఫొటో షేర్‌ చేస్తూ శ్రద్దా దాస్‌ అని ప్రచురించింది. అది కాస్తా ఈ హీరోయిన్‌ కంటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైంది.

'వార్నీ, అన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మీకు నా పేరు కూడా సరిగా రాయడానికి రావట్లేదా?' అని మండిపడింది. ఇక తన పేరును సరిగ్గా పలుకుతున్నవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 'నా పేరును సరిగా ఉచ్ఛరించేవారిని అభినందిస్తున్నాను. మీ కీబోర్డ్‌లో దాస్‌ లేదా కపూర్‌ అని చూపించినా శ్రద్దా శ్రీనాథ్‌ అని సరిగ్గా టైప్‌ చేస్తున్నారంటే అది మీరు నామీద చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేరును శ్రద్దా రామా శ్రీనాథ్‌ అని మార్చుకున్నాను. ట్విటర్‌లో కూడా ఇలాగే మార్చుకుంటే బెటరేమో.. రామా మా అమ్మ పేరు. కాబట్టి ఇకపై నన్ను శ్రద్దా రామా శ్రీనాథ్‌ అనే పరిచయం చేసుకుంటాను. మీరే చూస్తారుగా!'

'ఇక దీని గురించి మీరేం చింతించకండి. నన్ను శ్రద్దా దాస్‌ అనో శ్రద్దా కపూర్‌ అనో కాకుండా కేవలం శ్రద్దా శ్రీనాథ్‌ అని పిలవండి చాలు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు నా పేరు కూడా సరిగా రాయడం లేదు. బహుశా మీరు జర్నలిజం స్కూలులో పెద్దగా క్లాసులు వినకపోయి ఉండొచ్చు, కానీ ఇకనైనా నా పేరు కరెక్ట్‌గా రాయండి. సరే మరి, మరో నాలుగు నెలల వరకు నేను ట్విటర్‌కు బ్రేక్‌ ఇస్తున్నాను' అంటూ వరుస ట్వీట్లు చేసింది శ్రద్దా శ్రీనాథ్‌.

చదవండి:  భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌, ప్రణీత ఏమందంటే?
ఎంత బిజీగా ఉన్నా నా ఇద్దరు మాజీ భార్యలను తప్పకుండా కలుస్తా..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top