'బాలీవుడ్‌లో మర్యాద ఇవ్వరు'.. సిమ్రాన్‌ షాకింగ్ కామెంట్స్..! | Senior Actress Simran comments about Bollywood Treat South Actors | Sakshi
Sakshi News home page

Simran: 'సౌత్ వాళ్లంటే బాలీవుడ్‌లో చిన్నచూపు '.. సిమ్రాన్‌ షాకింగ్ కామెంట్స్..!

May 8 2026 12:20 PM | Updated on May 8 2026 12:27 PM

Senior Actress Simran comments about Bollywood Treat South Actors

గతేడాది టూరిస్ట్ ఫ్యామిలీతో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. ఈ మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఫ్యామిలీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో తెలుగులో స్టార్ హీరోల సినిమాలు చేసింది. హర్‌జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్‌ ప్రారంభించింది సిమ్రాన్‌.. బాలీవుడ్‌లో కన్నా సౌత్‌లోనే ఎక్కువ స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా  ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్‌ దక్షిణ నటులకు గౌరవం ఇవ్వరని సిమ్రాన్ అన్నారు. సౌత్ నటీనటులకు కేటాయించే హోటళ్లు, టికెట్లు, స్టాఫ్ విషయంలో కూడా బేరసారాలు చేస్తారని కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ప్రస్తావించారని ఆమె గుర్తు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో దక్షిణాది నటులకు సరైన గౌరవం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మాకు ఎంత గుర్తింపు వచ్చినా బాలీవుడ్‌లో పట్టించుకోరని అన్నారు. తాను హిందీ సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు. తాజాగా సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement