మేకప్‌కే ఐదు గంటలు పట్టేది: సత్యదేవ్‌ | Satya Dev Speech At Rao Bahadur O Sundari Song Launch Event | Sakshi
Sakshi News home page

మేకప్‌కే ఐదు గంటలు పట్టేది: సత్యదేవ్‌

Apr 17 2026 12:13 AM | Updated on Apr 17 2026 12:13 AM

Satya Dev Speech At Rao Bahadur O Sundari Song Launch Event

దీపాథామస్, సత్యదేవ్‌

‘‘రావు బహదూర్‌’లో నేను పోషించిన రామప్పపాత్రకి ప్రతి రోజూ మేకప్‌కే ఐదు గంటలు పట్టేది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్‌బాబుగారితో కలసి నటించాను. కానీ, ఆ సన్నివేశం చిత్రంలో లేదు. ఇప్పుడు నా ‘రావు బహదూర్‌’ సిని మాను ఆయన సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో సత్యదేవ్‌ తెలిపారు. వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్‌ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్‌’.

జీఎంబీ ఎంటర్‌టైన్ మెంట్‌ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర నిర్మించారు. స్మరణ్‌ సాయి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఓ సుందరి...’ అంటూ సాగేపాట విడుదల వేడుకని నిర్వహించారు. రెహ్మాన్‌ రచించిన ఈపాటని విజయ్‌ యేసుదాస్‌పాడారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘బాహుబలి, అవతార్‌’లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే ఆడియన్స్‌ని కూర్చోబెట్టగలిగాయో మా ‘రావు బహుదూర్‌’ కూడా అంతే స్థాయిలో అలరిస్తుంది’’ అని చెప్పారు.

వెంకటేశ్‌ మహా మాట్లాడుతూ– ‘‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా ఇచ్చిన అనుభూతికి పది రెట్లు ఎక్కువ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ‘రావు బహదూర్‌’ తీశాను’’ అని పేర్కొన్నారు. ‘‘మంచి థియేట్రికల్‌ అనుభూతి ఇచ్చే సినిమా ఇది’’ అన్నారు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, గోపాలకృష్ణా రెడ్డి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement