సారా ఖాన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్‌ | Sara Ali khan Celebrated Her Birthday With Family | Sakshi
Sakshi News home page

సారా ఖాన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్‌

Aug 12 2020 10:02 AM | Updated on Aug 12 2020 2:29 PM

Sara Ali khan Celebrated Her Birthday With Family - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా ఖాన్‌ 25వ యేటలోకి అడుగుపెట్టింది. తన కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్ చేసింది. ఇందులో బెలూన్లు, కేక్స్‌, ఇంకా షాంపిన్‌ బాటిల్‌ వుంది. తన ఇంటిలో హ్యాపీ బర్త్‌డే అని రాసి బెలూన్లతో అలంకరించిన ప్రదేశంలో సారా ఫోటోలు దిగి వాటిని షేర్‌ చేసింది. సారా పుట్టిన రోజు సందర్భంగా రెండు కేక్‌లను తెప్పించారు. వాటిలో ఒకటి తన సోదరుడు తెప్పించినట్లుగా సారా తెలిసింది. బర్త్‌డే ఫోటోలతో పాటు తన సోదరుడితో కలిసున్న ఫోటోను సైకిలింగ్‌ చేస్తున్న వీడియోను కూడా సారా షేర్‌ చేసింది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు సారాను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సినిమాల్లోకి 2018లో ఎంట్రీ ఇచ్చిన సారా.. కేధర్‌నాధ్‌, సింబా సినిమాలతో హిట్‌ అందుకుంది. ప్రస్తుతం వరణ్‌ థావన్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం కూలీ నెంబర్‌ 1 విడుదల కావాల్సి ఉంది. 

 

Gone with the Wind 💨🧢🚲🌈🌴🌧☔️☮️💟

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎంత మార్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement