Ram Charan Shankar Movie: Salman Khan Play A Pivotal Role In Ram Charan Next Movie | రామ్‌చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌! - Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌!

Apr 12 2021 8:09 AM | Updated on Apr 12 2021 9:54 AM

Salman Khan To Play A Pivotal Role In Ram Charan Shankar Film - Sakshi

ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఓ పాత్రను దక్షిణాదిలో సూపర్‌ క్రేజ్‌ ఉన్న చిరంజీవితో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట

రామ్‌చరణ్‌తో బాలీవుడ్‌ భాయ్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నారా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఓ పాత్రను దక్షిణాదిలో సూపర్‌ క్రేజ్‌ ఉన్న చిరంజీవితో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట శంకర్‌.

అయితే ఇదే పాత్రను హిందీలో సల్మాన్‌ఖాన్‌తో చేయించాలనుకుంటున్నారట. చిరంజీవి– రామ్‌చరణ్‌– సల్మాన్‌ ఖాన్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ నటించే అవకాశాలు లేకపోలేదని టాక్‌. పైగా కథకి ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో సల్లూ భాయ్‌ పచ్చజెండా ఊపుతారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి సల్మాన్‌ నిర్ణయం ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి మరి. 

చదవండి :
హోమ్‌ క్వారంటైన్‌కు పవన్‌కల్యాణ్‌
రజనీ రాజకీయాలపై ఎప్పుడో చెప్పా! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement